ప్రతి ఒక్కరూ ముక్కలు నాటాలి : సర్పంచ్ నవీన్
విశ్వంభర,మహేశ్వరం : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు గడికోట ప్రాంగణములోని తెలంగాణ క్రీడా ప్రాంగణం లో మొక్కల నాటారు. గ్రామంలో పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ ప్రకృతి మనకు అమూల్యమైన వరం ప్రకృతిలో ద్వారా లభించే స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చని చెట్లు జీవ వైవిధ్యం మనకు జీవనాధారాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం అటవీ నిర్మూలన వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా అలాగే ఒక్కొక్కరు ఒక మొక్క నాటితే, పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించగలం అనే సంకల్పంతో ముందుకు సాగుదాం అని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అడవి సంపదను సృష్టించడము ద్వారా వర్షాలు సకాలములో పడదముతోపాటు , వాతావరణ వేడిని తగ్గిస్తుందని దీనితో వాతావరణ సమతుల్యత ఏర్పడి వర్షాలు సకాలములో కురుస్తాయని, దీనితో రైతులు అధిక మొత్తములో పంట దిగుబడి సాదించి ఆర్థికంగా కూడా ఎదగవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమములో జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలప్రధానోపాద్యాయుడు శంకర్, ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, నాయకులు పి ఎ సి ఎస్ మాజీ డైరెక్టర్ కదామోని ప్రభాకర్, మునావత్ భరత్, బొమ్మనమైన బాబు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శి సుజాత పాల్గొన్నారు.