రామన్నపేట కోర్టులో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 

విశ్వంభర, రామన్నపేట:  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, రామన్నపేట ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి – కమ్–చైర్మన్ జి.సబిత, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, రామన్నపేట మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రత్నకుమారి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సుక్క శ్రవణ్ కుమార్, ప్యానెల్ అడ్వకేట్లు కూనూరు శ్రీనివాస్, సోమ సతీష్ రెడ్డి, బర్ల డేవిడ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ నోముల స్వామి, శ్రీ ఎన్.వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామన్నపేట, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని అందరికీ అవగాహన కల్పించారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/world-environment-day-was-celebrated-in-ramannapet-court/article-16298

Tags: