అమ్మ పేరుతో మొక్కలు నాటిన 'ప్రజా హృదయం' 

అమ్మ పేరుతో మొక్కలు నాటిన 'ప్రజా హృదయం' 

విశ్వంభర, మహబూబాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో  భారీ ర్యాలీ ,  పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు .  ప్రజా హృదయం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో   జరిగిన  ఈ కార్యక్రమానికి  మున్సిపాలిటీ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్, మున్సిపల్ కమిషనర్  యం.వినోద్ కుమార్ వార్డు కౌన్సిలర్లు ,  చిదిరాల అరుణ్, మాదార బోయిన యాకన్న, గుంటి కార్తీక్ పర్యావరణ జాతీయ అవార్డు గ్రహీత దైద హర్షిత్,  అ ధికారులు, ఉపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు .  పట్టణంలో   ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు .  ఈ సందర్భంగా హరిత మిత్ర అవార్డు గ్రహీత, వనమిత్ర దైద వెంకన్న కార్యక్రమాన్ని ఉద్దేశించి  మాట్లాడుతూ "ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకుని, పర్యావరణ హితమైన కాటన్ బ్యాగులను ఉపయోగించాలని , ప్రజలకు పిలుపునిచ్చారు .  ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు, జీవజాలం తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయని వివరించారు. అలాగే రోజురోజుకు పెరుగుతున్న భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ప్రభావాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకాన్ని తమ బాధ్యతగా భావించాలని సూచించారు. " అమ్మ పేరుతో ఒక మొక్క" అనే సందేశంతో ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని , పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. నేడు నాటిన ఒక మొక్క రేపటి తరాలకు ప్రాణవాయువును అందిస్తుంది. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి" అని అన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేశారు .

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-heart-of-the-people-who-planted-saplings-in-the/article-16327

Tags: