పక్షపాతం లేకుండా వార్డుల అభివృద్ధి

పక్షపాతం లేకుండా వార్డుల అభివృద్ధి

  • ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యత: ఎమ్మెల్సీ

విశ్వంభర, మహబూబాబాద్:  పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్థానిక మునిసిపల్ కార్యాలయంలో గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవ శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్  సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మునిసిపల్ చైర్మన్, మునిసిపల్ కమిషనర్ మరియు పట్టణ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులలో నెలకొన్న పలు సమస్యలపై కౌన్సిలర్లు తీసుకొచ్చిన అంశాలపై ఎమ్మెల్సీ, సుదీర్ఘంగా చర్చించి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.  పట్టణ అభివృద్ధిలో ఎలాంటి రాజకీయ పక్షపాతాలకు తావుండకూడదని ఎమ్మెల్సీ  స్పష్టం చేశారు. బిఆర్ఎస్ వార్డు మెంబర్లకు నిధులు తక్కువగా ఇవ్వడం లేదా అసలు ఇవ్వకపోవడం, ఇతర పార్టీ వార్డులకు ఎక్కువగా కేటాయించడం వంటి చర్యలు సరికావు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే. వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష చూపకుండా, అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించి పట్టణాన్ని ఏకతాటిపై అభివృద్ధి చేయాలి అని అధికారులను, చైర్మన్‌ను ఆదేశించారు. పేదల కలల నీడ అయిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు అని ఎమ్మెల్సీ  కోరారు. కేవలం అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని, నిజమైన పేదలకు, ఇల్లేని వారికే ఇళ్లు దక్కేలా పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కమిషనర్‌కు సూచించారు. పట్టణంలో సాయంత్రం వేళల్లో కొంతమంది ఆకతాయి యువకుల ప్రవర్తన వల్ల మహిళలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై ఎమ్మెల్సీ గారు తీవ్రంగా స్పందించారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ విషయమై స్థానిక పోలీసు అధికారులు  ప్రత్యేక పెట్రోలింగ్ చేప్పట్టి, ఈవ్-టీజింగ్ నిరోధక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాలని కోరారు.   మహబూబాబాద్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల బెడదపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దీనిపై మునిసిపల్ యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ (సంతానోత్పత్తి నియంత్రణ) శస్త్రచికిత్సలు వేగవంతం చేసి, ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు రక్షణ కల్పించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా మహబూబాబాద్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఎమ్మెల్సీ  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, అన్ని వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/development-of-wards-without-bias/article-16264

Tags: