మరమ్మతులకు నోచుకోని తుమ్మలచెరువు కట్టు కాలువ

విశ్వంభర, సైదాపూర్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ లోని తుమ్మలచెరువు కట్టు కాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులను నష్టాల నుంచి కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మునుపాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు తుమ్మలచెరువు కట్టు కాలువ రెండు చోట్ల తెగిపోయిందని, ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. భారీ వర్షాలు కురిస్తే తుమ్మలచెరువు కట్ట పూర్తిగా తెగిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు..వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తెగిన ప్రాంతాల్లో మట్టి, రాళ్లతో అడ్డుకట్ట వేసి కట్టను బలోపేతం చేయాలని కోరారు. ఆలస్యం చేస్తే భారీ నష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. తుమ్మలచెరువు మత్తడి పడిన సమయంలో వచ్చే వరద నీటితో సైదాపూర్, జాగిరిపల్లి, ఆరేపల్లి, బూడిదపల్లి, సోమారం గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములు నీటమునిగి రైతులకు భారీ పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.చెరువు కట్టపై ఇరువైపులా తుమ్మ చెట్లు, పొదలు విస్తరించి రైతులు కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించి కట్టను బాగు చేయాలని కోరారు. పోల్కమ్మ చెరువుకు సాగునీరు అందించే రెండు తూములు కూడా దెబ్బతిన్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tummalacheruvu-is-a-canal-that-has-not-been-repaired/article-16244

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?