జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

  • హుస్నాబాద్ కోర్టు జడ్జిలు రేవతి,  ప్రమీద 
  • పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కల నాటిన జడ్జిలు

విశ్వంభర, హుస్నాబాద్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బి. రేవతి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈ. ప్రమిద పిలుపునిచ్చారు. జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహణపై హుస్నాబాద్ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం పోలీసు శాఖ అధికారులు, బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి బి. రేవతి మాట్లాడుతూ రాజీకి వీలున్న కాంపౌండబుల్ కేసులన్నింటినీ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని సమయం, ధనం ఆదా చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోర్టు ఆవరణలో జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జడ్జిలు సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని మల్లేశం, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ రెడ్డి, పీపీ ఎం.కె. నాగరాజ్, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి పోలీస్ స్టేషన్ల ఎస్సైలు పి. లక్ష్మారెడ్డి, పి. అభిలాష్, ప్రశాంత్, తిరుపతి, సీనియర్ న్యాయవాదులు ఒగ్గోజు సదానందం, కన్నోజు రామకృష్ణ, జె. కిరణ్ కుమార్, ఉప్పరపల్లి సంపత్, దీకొండ ప్రవీణ్, విశ్వతేజ్, సాయికుమార్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/take-advantage-of-national-mega-lok-adalat/article-16294

Tags: