హుస్నాబాద్ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గుర్తింపు
విశ్వంభర, హుస్నాబాద్ :చెత్త నిర్వహణలో ఉత్తమ మున్సిపాలిటీగా రాష్ట్ర అవార్డు అందుకున్న హుస్నాబాద్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ టి. మల్లికార్జున్‌లను టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సత్కరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. పర్యావరణ పరిరక్షణ, పట్టణ పరిశుభ్రత, సమర్థవంతమైన చెత్త నిర్వహణలో హుస్నాబాద్ మున్సిపాలిటీ సాధించిన ఈ విజయాన్ని అభినందించిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్‌లు ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు, కౌన్సిలర్లు, అధికారులు భాగస్వాములై హుస్నాబాద్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆకారపు భాస్కర్ రెడ్డి, హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ హసన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.