లచ్చమ్మ కుటుంబానికి గౌడ సంఘం పరామర్శ
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బండారి లక్ష్మమ్మ కుటుంబాన్ని గౌడ కౌండిన్య సంఘం ప్రతినిధులు గురువారం పరామర్శించారు. లచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కుమారులు వెంకన్న, రాములు,అప్పన్న తో పాటు కుటుంబ సభ్యులకు ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని సంఘం ప్రతినిధులు ధైర్య వచనాలు చెప్పారు. అనంతరం సంఘ సభ్యులైన లచ్చమ్మ మనుమలు సది,నరేష్,కిషోర్ లకు సంఘము నుంచి రూ. 2,500 సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కూటికంటి మధు, సంఘం నాయకులు వేముల శ్రీనివాస్,కందునూరి శ్రీను,గడ్డం శ్రీకాంత్,దుబ్బాక రవి,కూటి కంటి ప్రవీణ్,బుర్ర సందీప్ తదితరులు పాల్గొన్నారు.