రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగం కార్యదర్శులుగా హేమలత, విజయలక్ష్మి
విశ్వంభర, హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగం కార్యదర్శులుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మాడిశెట్టి హేమలత, నార్ల విజయలక్ష్మి ఎన్నిక కావడం పట్ల జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చొల్లేటి లత, హుస్నాబాద్ ఆర్య వైశ్య యువజన విభాగం అధ్యక్షుడు కంభంపాటి సందీప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన హేమలత, విజయలక్ష్మి ఆర్య వైశ్యుల సంక్షేమం, సంఘం అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ, సంఘం చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ముందుండాలని సూచించారు. వీరిరువురు తమ పదవీకాలంలో సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల ద్వారా ఆర్య వైశ్య సమాజానికి మరింత గుర్తింపు తీసుకురావాలని కోరుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే నూతన బాధ్యతలు చేపట్టిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.