గొర్రెల కాపరుల వలసలు ఆపాలి
- : యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్
విశ్వంభర, బషీర్ బాగ్: సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గొర్రెలకాపరుల వలసలు ఆపాలనీ యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సుమారు 1500 గొర్రెల కాపరుల సొసైటీలకు నల్లమల అడవులను కేటాయించాలన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 50 లక్షల గొర్రెలకు మెయ్యడానికి మేత(పశుగ్రాసం) లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారన్నారు.రానున్నది వర్షాకాలం కాబట్టి గ్రామాలల్లో గొర్రెలు మెయ్యడానికి మేత ఉండదన్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న నల్లమల్ల అడవి ప్రాంతాన్ని గొర్రెలు మేత మెయ్యడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.గొర్రెలు అడవిలో ఉన్న గడ్డిని మాత్రమే మేస్తాయి.అడవిలో గొర్రెలు మెయ్యడం వల్ల అడవులలోని చెట్లకు ఎటువంటి నష్టం ఉండదన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల బిడ్డగా గొర్రెలకాపరులకు నల్లమల్ల అడవి ప్రాంతం కేటాయించాలన్నారు.గొర్రెలకు, గొర్రెల కాపరులకు ప్రభుత్వమే ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.గొర్రెల కాపరులకు నెలకు 5000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గొల్ల కురుమల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.