ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్

ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్

  •  కుడకుడ వార్డు సభలో ఎస్పీ నరసింహ 

విశ్వంభర, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధి 1వ వార్డు కుడకుడ గ్రామం లో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నర్సింహా హాజరై మాట్లాడారు. ప్రజలు, సమాజం అభివృద్ధికి ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయి, అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధికి పాటుపడుతుంది అన్నారు,  గ్రామం సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని  అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకు త్వరితగతిన వాటికి పరిష్కారం చూపడం కోసం ఈ గ్రామ, వార్డు సభలు ముఖ్య ఉద్దేశ్యం, అధికారులు ప్రజల వద్దకు వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు అని తెలిపినారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందని శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నామని ఆధునిక పోలీసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పౌరులు సత్ప్రవర్తనతో చట్ట పరిధిలో నడుచుకోవాలని సూచించారు. స్థానిక సమస్యలపై, అసాంఘిక కార్యకలాపాలపై, ఆకతాయిల పై సమాచారం ఇవ్వడం లో ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని ఒక పోలీస్ అన్నారు. తగాదాలు గొడవలు పెట్టుకుంటే కేసుల పాలవుతారని ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. మహిళల భద్రత లో పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత పనిచేస్తుందని అన్నారు, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల గురవ్వకుండా సురక్షితంగా గమ్యం చేరాలని అన్నారు. మన సమాజంలో యువతను గంజాయి లాంటి మాదకద్రవ్యం పట్టిపీడిస్తుందని దీనిని క్షేత్రస్థాయిలో నిర్మూలించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నదని, గంజాయి కి సంబంధించిన సమాచారాన్ని పోలీసువారికి ఇవ్వాలని సూచించారు. ఫోన్లకు సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు బ్లూ లింకులు అనుసరించి బహుమతులు ఉన్నాయంటే అత్యాశ పోయి వ్యక్తిగత వివరాలు అపరిచితులకు ఇచ్చి ఆర్థికంగా నష్టపోవద్దని సైబర్ మోసాలకు గురికావద్దు అని తెలిపారు. దాడులు, దొంగతనాలు, మహిళా వేదింపులు, రోడ్డు ప్రమాదాలు లాంటి సమస్యలపై, పోలీసు స్టేషన్ కు రాలేని పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100, 112 కు సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి ఇంటి నుండే కేసులు నమోదు చేసి కేసు పత్రాలను ఫిర్యాదుదారులకు బాధితులకు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మొర్రిశెట్టి నివేదిత లక్షది,మునిస్పల్ కమిషనర్, సిహెచ్ హనుమంత్ రెడ్డి,స్థానిక కౌన్సిలర్, హెల్త్ సెంటర్ వైద్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ అధికారులు, స్థానిక ఎస్ఐ, పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/every-citizen-is-a-policeman-without-uniform/article-16262

Tags: