చెరువుకట్ట ఆక్రమణ పై అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు
విశ్వంభర, ఇనుగుర్తి: చెరువు కట్టను అక్రమంగా తవ్వి ఆక్రమించుకుంటున్నారని, దీనిని పరీక్షించాలని కోరుతూ ఇనుగుర్తి మండలం చీన్య తండాకు చెందిన జాటోత్ రామ్ జీ నాయక్ జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ అనిల్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి శివారుకు చెందిన ఎదులకుంట చెరువు కింద చీన్య తండావాసుల భూములు ఉన్నాయి. సంబంధిత చెరువు కట్టను చీన్య తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇస్లావత్ శివరాం, సీతారాం తవ్వి ఆక్రమించుకొని సాగు చేసుకోవడానికి తన సాగు భూమిలో కలుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని తెలిపారు. తండా పెద్దలు చెరువు కట్టను తవ్వద్దని చెప్పినప్పటికీ ఏం చేస్తారో చేసుకోండని ఖాతరు చేయడం లేదన్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకొని చెరువు కట్టను ఆక్రమణ నుంచి పరిరక్షించాలని కోరారు.