కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక.
అధ్యక్షుడిగా కోటేశ్వర్.
విశ్వంభర హనుమకొండ జిల్లా :-హనుమకొండ జిల్లా కాకతీయ కాలనీ లో కుబేర హోమ్స్ వేల్పర్ సొసైటీ ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరిగింది. కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ ఎన్నికల్లో అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు ఏకతాటిపై ఉండి నూతన కమిటీని ఏకగ్రీవంగా కోటేశ్వర్ ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం అధ్యక్షుడు కమిటీ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తదనంతరం ఉపాధ్యక్షునీ. నరసింహ స్వామిని, కార్యదర్శిగా మేఘరాజును, జాయింట్ కార్యదర్శిగా మహేందర్ ను, కోశాధికారి ఆనంద్ ని కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కోటేశ్వర్ మాట్లాడుతూ. కుబేర హోమ్స్ వెల్ఫేర్ సొసైటీ కమిటీని అన్ని విధాల ముందుకు నడిపిస్తానని, అపార్ట్మెంట్లో ఉన్న సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని అన్నారు. కార్యక్రమంలో అడ్వైజర్ కమిటీ సభ్యులు ఎస్ బిక్షపతి, ప్రసన్న కుమార్ ,గురు ప్రసాద్, వెంకటరమణ, లింగమూర్తి ,ఓం ప్రకాష్ ,బాబు గౌడ్,కార్యవర్గ సభ్యులు మేఘరాజ్, చంద్రశేఖర్ ,రవీందర్, వెంకటరమణ ,దయానంద్, రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సభ్యులు. ఇందిర, గౌతమి ,శ్రీలత, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



