మాధవనంద స్వామి పర్యవేక్షణ లో భవాని మాత ఆలయం లో కన్నుల పండవగా శ్రీ కోటి శ్రీ సూక్తా పారాయణం

పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్

మాధవనంద  స్వామి పర్యవేక్షణ లో భవాని మాత ఆలయం లో  కన్నుల పండవగా శ్రీ కోటి శ్రీ సూక్తా పారాయణం

విశ్వంభర, సంగారెడ్డి  : భవానీ భువనేశ్వరి దేవాలయంలో శ్రీకోటి శ్రీ సూక్తా పారాయణ కార్యక్రమాన్ని ఆదివారం కన్నుల పండుగ నిర్వహించారు. బసవ కళ్యాణ్ పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి, రంగంపేట పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ మధుసూదానంద సరస్వతి స్వామి వార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సంగారెడ్డి పట్టణంలో అమ్మవారి నామస్మరణతో ఒక ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వెయ్యి మందికి పైగా మహిళలు సామూహిక లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పూలను అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తో పాజి అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-12-30 at 1.21.36 PM

Tags: