గురుకులం సందర్శించిన జోనలాఫీసర్
- అటెండర్ ఆత్మహత్యాయత్నంపై విచారణ
విశ్వంభర,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో అటెండర్ ఆత్మహత్యాయత్నంపై గురుకుల సొసైటీ జోనల్ ఆఫీసర్ అపర్ణ శనివారం విద్యాలయాన్ని ఎంపీడీవో బండారి పార్థసారథి తో కలిసి సందర్శించారు. ఈ మేరకు విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ జయశ్రీ తో పాటు, టీచర్స్ బృందాన్ని, అటెండర్ లను, బాల బాలికలను విడివిడిగా కలిసి సంబంధిత సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ సంబంధిత విషయంపై విస్తృతంగా విచారణ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వంటశాలను సందర్శించి బాలికల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను చూశారు. విద్యాలయంలోని తరగతి గదులను, వసతి రూములను,డైనింగ్ హాల్, ఇతర సౌకర్యాలతో పాటు పరిసరాలను ఆరా తీశారు.స్టోర్ రూమ్ తనిఖీ చేసి బియ్యంతో పాటు ఇతర సరుకుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సై గంగారపు కరుణాకర్. దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ పార్టీల నాయకులు గురుకుల విద్యాలయాన్ని సందర్శించి ఆత్మహత్య ప్రయత్నం విషయంపై నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.