బాధిత కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయం

విశ్వంభర, గుండాల :  గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఏలూరి బలరాం ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్  పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయాన్ని అందజేసి, ఈ క్లిష్ట సమయంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మబ్బు మహేష్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవసేవ" అనే మహోన్నత లక్ష్యంతో మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ మండల వ్యాప్తంగా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాండ్ర నారాయణ స్వామి, తాండ్ర యాదగిరి, తాండ్ర రాజు, ఫౌండేషన్ సభ్యులు మలిపెద్ది విక్రమ్ రెడ్డి, మల్లెపాక పరశురాములు, గొల్లపల్లి సురేష్, అల్వాల రాజు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-of-rs-5016-to-the-affected-family/article-18011

Tags: