డీసీసీ సభ్యులకు సన్మానం

డీసీసీ సభ్యులకు సన్మానం

విశ్వంభర, సిద్దిపేట: నూతనంగా నియమితులైన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎల్లా శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రంగు అశోక్ గౌడ్, సెక్రటరీ శేరీ సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాటం కనకయ్యలను నంగునూర్ మండలం రాంపూర్‌లో సీనియర్ నాయకులు రాపోల్, రాజ్ బహదూర్‌రెడ్డి, ఎంఎసీ వైస్ ఛైర్మన్ సాదుల పవన్ కుమార్ ఆదివారం ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డీసీసీ కమిటీలలో అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాజగోపాల్‌పేట సర్పంచ్ చేర్యాల వాణి రాధాకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ జీవన్ నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ బొల్లు శ్రీశైలం, కాటం విద్యాసాగర్, గడ్డం కరుణాకర్, శ్యామ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రవి, మహేష్, వర్దోలు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-dcc-members/article-18068

Tags: