పరిగి ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా సారపు రాధిక ఎన్నిక
విశ్వంభర, పరిగి: పరిగి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా సారపు రాధిక శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం మహిళా నాయకురాళ్లు ఆమెకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు. అనంతరం సారపు రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. సంఘ సభ్యులంతా ఐక్యంగా పనిచేస్తూ కేవలం ఆర్యవైశ్యుల సమస్యలకే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే స్వచ్ఛత, సేవా కార్యక్రమాల్లో మహిళలు చురుకుగా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు పోలిశెట్టి సువర్ణ, కార్యదర్శి రాజమణి, కోశాధికారి వేముల సంగీత, విజయలక్ష్మి, శకుంతల, పాలాది లక్ష్మి, ఆర్యవైశ్య మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.