నస్కల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

నస్కల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

విశ్వంభర, పరిగి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని  పరిగి మున్సిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శశికళ ఆనంద్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీ చంద్రయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శశికళ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు బాల్ రాజ్, మాలే రాజు, వెంకటయ్య, నవీన్, మాణిక్యం, సత్తయ్య, మహమ్మద్, ఉపాధ్యాయులు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Tags: