స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం
- టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
విశ్వంభర, సంగారెడ్డి : పట్టణం లో 24 , 26 వ వార్డుల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్ ఆధ్వర్యం లో సర్ ప్రక్రియ లో ప్రజలకు సహాయం చేసేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ క్యాంప్ లో 1500 కు పైగా ఓటర్ల కు మ్యాపింగ్ తో ప్రక్రియ ను పూర్తి చేశారు. ఈ శిబిరాన్ని ఆదివారం టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సందర్శించారు. పూర్తి చేసిన ఫారాలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సర్ ప్రక్రియ పైన, మ్యాపింగ్ ఎలా చేయాలో తెలియని వారి కోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసి సహాయం చేయడం అభినందనీయం అన్నారు. ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్ ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఎల్వో లతో పాటు మహమ్మద్ కుతుబుద్దిన్, షేక్ రఫీ, మాజీ కౌన్సిలర్ ఖాజా, జహీర్, అజ్జు, ఆబెద్, హుజేఫా, జాహెద్, అడ్డూ, ఇఫ్తేకర్, రవుఫ్ తదితరులు పాల్గొన్నారు.