సిటీ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో 'క్లీన్ క్యాంపస్' కార్యక్రమం
విశ్వంభర, హైదరాబాద్: ఏబీవీపీ సిటీ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కళాశాల ప్రాంగణంలో 'క్లీన్ క్యాంపస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై 9న జరగనున్న ఏబీవీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిటీ కళాశాల ఏబీవీపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ఆవరణను శుభ్రపరిచి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్తను చెత్తబుట్టల్లోనే వేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన క్యాంపస్ నిర్మాణానికి ప్రతి విద్యార్థి సహకరించాలని అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డా. నాగరాజు, ఏబీవీపీ కమిటీ సభ్యులు అరవింద్, అఖిల్, మనీష్, సన్నీ, జతిన్, అమన్, సాహితీ, హర్షిత, చిన్మయి, శివ, అభిషేక్, సాగర్, నిహార్, రాజేష్, భాను, రాహుల్, బన్నీ, టింకు, నవనీత్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.