శ్రీరామగిరి బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులుగా యాకిరెడ్డి
విశ్వంభర, నెల్లికుదురు: భారతీయ జనతా పార్టీ నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శాఖ అధ్యక్షులుగా శ్రీరామగిరి పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన నల్లెడి యాకిరెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు ప్రకటించారు. వెంకటాపురంలో ఆదివారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి వెంకటేశ్వర్లు హాజరై వారి సమక్షంలో యాకిరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ బిజెపి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సమిష్టిగా ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తెలియజేస్తూ అర్హులకు అందేలా కృషి చేయాలని సూచించారు. నూతన అధ్యక్షులు యకిరెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి పదవి లో నియమించినందుకు బిజెపి రాష్ట్ర నేత జాటోతు హుస్సేన్ నాయక్ కు,జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లుకు, ప్రధాన కార్యదర్శి మదన్లాల్, మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్ యాదవ్ తో పాటు జిల్లా మండల గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా,మండల,నాయకులు సతీష్, నల్లాని పాపారావు,కిరణ్ గౌడ్,రాసయాకిరెడ్డి, బూతు అధ్యక్షులు రొయ్యల చంటి,నల్ల మాస శ్రీను, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.