పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
: సర్పంచ్ హనుమంత్ నాయక్
విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు మండలం దావూద్ గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై సర్పంచ్ హనుమతునాయక్, ఉపసర్పంచ్ ఆర్ తేజ నాయక్, ఆధ్వర్యం లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నిల్వ నీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలి, దోమల నివారణ కోసం అవసరమైన జాగ్రత్తలు పాటించాలి,మురుగు కాలువలు, డ్రైనేజీలలో చెత్త వేయకుండా చూడాలి, విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నట్లయితే వెంటనే గ్రామపంచాయతీకి లేదా అధికారులకు సమాచారం ఇవ్వాలి,భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని గ్రామ ప్రజలకు సూచనలు చేసారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు వి. రవీందర్ నాయక్,చిన్న నాయక్, కందుకూర్ ఎ ఈ సతీష్ రెడ్డి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ ఈ ఓ జగతీష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.