స్వలాభం కోసమే అంబేద్కర్ సంఘంపై దుష్ప్రచారం
విశ్వంభర, మేడ్చల్: కీసర మండల అంబేద్కర్ సంఘానికి అడహాక్ కమిటీని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని, ప్రస్తుత కమిటీయే యథావిధిగా కొనసాగుతుందని సంఘం సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం కీసర పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో మండల అంబేద్కర్ సంఘం ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం బలోపేతం, ప్రస్తుత పరిణామాలపై క్షుణ్ణంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చినింగిని కృష్ణ, శీలం శ్రీనివాస్, తుడుం యాదగిరి, మంచాల రాజలింగం, శీలం మల్లేష్, చినింగని బాల్ రాజ్, బంటు శ్రీనివాస్, కుంటోళ్ల వెంకటేష్, కుంటోళ్ల బాల్ రాజ్ తదితరులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అయితే, కీసర మండల అంబేద్కర్ సంఘంపై ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిగత కక్షలు, స్వలాభం కోసమే మండలంలో కొందరు నలుగురు వ్యక్తులు తప్పుడు ఆరోపణలు, నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మండల కమిటీలో ఏవైనా వ్యత్యాసాలు లేదా భేదాభిప్రాయాలు ఉంటే సానుకూల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప, సంఘం గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదన్నారు. అనవసర గొడవలకు తావిచ్చేలా ‘అడహాక్ కమిటీ’ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపడం ఏంటని వారు ప్రశ్నించారు. మహనీయుడి విగ్రహంపై మూత్రం పోసిన అంశాన్ని పదే పదే సోషల్ మీడియాలో పెడుతూ అనవసర ప్రచారం చేయడాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా సీనియర్ అంబేద్కర్ సంఘం గట్టిగా తీర్మానించింది. కీసర మండల అంబేద్కర్ సంఘంలో అడహాక్ కమిటీకి ఎలాంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్, ఉపాధ్యక్షుడు గోరంటి ప్రవీణ్, కోశాధికారి రొండ్ల మహేష్, సంయుక్త కార్యదర్శులు మంచాల మహేష్, తాళ్ళ కిరణ్, కుర్రి పరమేష్, ఎంకిరాల నర్సింగ్, సంఘం నాయకులు పుండ్రు రాకేష్, మొరుగు క్రాంతి కుమార్, పట్టా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.