కాళీ మాత మందిరంలో భక్తులకు కనీస సౌకర్యాలు కలిపించాలి
విశ్వంభర, ఫలక్ నుమా : ఫలక్‌నుమా కాళీమాత మందిరానికి ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకవర్గం విఫలమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం షెడ్లు, కూర్చునే ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన స్థాయిలో లేవని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు మరియు ఆలయ పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.