పాఠశాలల మూసివేతపై ప్రజా ఉద్యమం : ఆర్ కృష్ణయ్య 

విశ్వంభర, హైదరాబాదు : 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని  లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిర్ణయం పేద, గ్రామీణ, దళిత, గిరిజన విద్యార్థుల విద్యా హక్కులకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బడుల్లో మౌలిక వసతుల లోపం, టీచర్ పోస్టుల ఖాళీలు పెరిగాయని విమర్శించారు. పాఠశాలల మూసివేత వెనుక కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యం ఉందని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి సమీపంలో ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీలా వెంకటేష్,  జిల్లపల్లి అంజి, పర్లగోర్ల మోడీ రాందేవ్, అనంతయ్య, రాజేందర్, డా. కప్పుల అన్వేశ్, పరిపూర్ణ చారి ,డా. రాజీవ్, డాక్టర్ అన్వేషి తదితరులు పాల్గొన్నారు.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/public-movement-against-closure-of-schools-r-krishnaiah/article-16684

Tags: