అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
- - మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్
విశ్వంభర, హుస్నాబాద్: ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాలు, కెసిఆర్ లాంటి తెలంగాణ వాదులు, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ 1969 నుంచి 2014 వరకు ఎందరో తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యమాలు చేశారన్నారు. 2001లో కేసీఆర్ ఆధ్వర్యంలో మొదలైన ఉద్యమం రాష్ట్రం సాధించే వరకు కొనసాగిందన్నారు. 2009లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు. ఉద్యమానికి దిగివచ్చిన కేంద్రం ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు సైతం ఉద్యోగం కల్పించిన ఘనత కేసిఆర్కే చెందుతుందని అన్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు అనేక వాగ్దానాలు చేసిందని, వాటిని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను మభ్యపెడుతూ కాలం వెల్లదీయకుండా వెంటనే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. లేకుంటే ఉద్యమకారులతో కలిసి పెద్ద ఎత్తున మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కష్టాలపాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లాగూ నెరవేర్చడం లేదని, కనీసం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలనైనా ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. త్వరలోనే హుస్నాబాద్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామ గ్రామాన తిరిగి ప్రజలతో మమేకమై పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని సతీష్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.