లీగ్ ఐకా కమ్యూనిటీలో క్లబ్ నోవా ప్రారంభం

విశ్వంభర, గండిపేట : హైదరాబాదు గండిపేటలోని లీగ్ ఐకా గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ నోవా పేరుతో ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్‌ను లీగ్ ఐకా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్జున్ ముత్యాలపాటి  ప్రారంభించారు. మొత్తం 194 విల్లాస్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పరిసరాల్లో గండిపేట చెరువు, మరోవైపు ఫారెస్ట్ పార్క్‌లు ఉండటంతో స్వచ్ఛమైన వాతావరణం లభిస్తోందని వివరించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 15 నిమిషాల్లో, గచ్చిబౌలి, కోకాపేటలకు 10 నిమిషాల్లో చేరుకునే అనుకూలత ఉందన్నారు. హైదరాబాద్, వైజాగ్, బెంగుళూరులోనూ సంస్థ వెంచర్లు కొనసాగుతున్నాయని తెలిపారు. నివాసానికి అనువైన వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. క్లబ్ హౌస్‌లో ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, మినీ కమ్యూనిటీ హాల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో విశ్వనాథ్ ముత్యాలపాటి, కొండల్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రవీందర్ రెడ్డి (రాధా రియాలిటీ) పాల్గొన్నారు.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-launch-of-club-nova-in-the-liga-ica-community/article-16660

Tags: