బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని  ‘హిస్సా – ఇజ్జత్ – హుకూమత్’ నినాదంతో ముందుకు సాగాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షతన  ఆదివారం జరిగిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్‌లో వాటా, రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యమని తెలిపారు. గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, డాక్టర్ అవ్వారు వేణు, యర్ర మాదా వెంకన్న, లింగేష్ యాదవ్‌లను నియమించారు. ప్రొఫెసర్ బెనర్జీని రాష్ట్ర వైస్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ విజయ్ బాబును పొలిటికల్ అడ్వైజర్‌గా నియమించారు. సమావేశంలో బీసీ ఉద్యమ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, భావజాల ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు, రాబోయే కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బెనర్జీ, ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి, చెన్న శ్రీకాంత్, డాక్టర్ అవ్వారు వేణు, యర్ర మాదా వెంకన్న, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-bc-movement-should-be-strengthened/article-16676

Tags: