బంగారు తెలంగాణ దిశగా ముందుకు: సోమయ్య

బంగారు తెలంగాణ దిశగా ముందుకు: సోమయ్య

విశ్వంభర, ఖమ్మం : బంగారు తెలంగాణ నిర్మాణంతో పాటు అమర వీరుల కలలను సాకారం చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎదులాపురం మునిసిపాలిటీ ఆటోనగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్ర సాధన చరిత్రాత్మక పోరాట ఫలితమని పేర్కొన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని, సామాజిక తెలంగాణ లక్ష్య సాధన కోసం పోరాటం కొనసాగాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/somaiya-moves-forward-towards-golden-telangana/article-16194

Tags: