బొంతు రామ్మోహన్ జన్మదిన వేడుకలు

బొంతు రామ్మోహన్ జన్మదిన వేడుకలు

  • వికలాంగులకు అరటిపండ్లు పంపిణీ

విశ్వంభర, వేములవాడ: హైదరాబాద్ నగర మాజీ మేయర్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన నిరుపేద వికలాంగుడు ఓదెల నరేష్ వినూత్న సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడెమొక్కులు చెల్లించిన నరేష్, అనంతరం ఆలయ మెట్ల వద్ద ఉన్న వృద్ధులు, వికలాంగులు, మతిస్థిమితం లేని నిరాశ్రయులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓదెల నరేష్ మాట్లాడుతూ.. బొంతు రామ్మోహన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో బొంతు రామ్మోహన్ మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా నాయకులపై అభిమానాన్ని చాటుకోవడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bonthu-rammohans-birthday-celebrations/article-18072

Tags: