ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం

విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని యదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మల్లం ధనమ్మ, పాగుడల వెంకటేశం లు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కమ్మలపల్లి మధు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారం అవుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-veeresham-participated-in-the-house-entry-of-indiramma/article-18056

Tags: