మోడల్ స్కూల్, కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

  • ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు

విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురులోని పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ, 7వ, 8వ తరగతులు,ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (ఎంపీసీ, బైపీసీ,సీఈసీ) కోర్సులలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నట్లు ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తమ విద్యాసంస్థలో ఆంగ్ల మాధ్యమ బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, డిజిటల్ తరగతి గదులు,సైన్స్ ల్యాబ్‌లు,అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రీడా సౌకర్యాలు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఇంటర్మీడియట్ విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం (సీట్ల లభ్యత మేరకు) కలదని తెలిపారు. అర్హులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవసరమైన ధ్రువపత్రాలతో వెంటనే పాఠశాలను సంప్రదించి స్పాట్ అడ్మిషన్ పొందాలని,సీట్లు పరిమితంగా ఉన్నందున ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత లభిస్తుందని వివరించారు.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/spot-admissions-in-model-school-college/article-18118

Tags: