మధ్యాహ్న భోజనం పరిశీలన

మధ్యాహ్న భోజనం పరిశీలన

 విశ్వంభర, పెద్ద శంకరంపేట:  పెద్ద శంకరంపేట మండల పరిధిలోని జి. వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్రస్థాయి అధికారి రాజశేఖర్  మధ్యాహ్న భోజనాన్ని బుధవారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్, తల్లిదండ్రుల సమావేశానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మధ్యాహ్న భోజన కార్మికులతో వేరువేరుగా చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ఆయన పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పాఠశాల ఎఎంసి చైర్మన్ కు సూచించారు. విద్యార్థులకు తప్పనిసరిగా నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటేశం ప్రధానోపాధ్యాయురాలు కావ్య ఎమ్మార్సీ సిబ్బంది సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు..

Tags: