మున్నూరుకాపు భవన నిర్మాణానికి భూమి పూజ

మున్నూరుకాపు భవన నిర్మాణానికి భూమి పూజ

విశ్వంభర, సిద్దిపేట: మున్నూరుకాపు సంక్షేమ సంఘం సభ్యులు జిల్లా కేంద్రంలోని సంఘం నూతన భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు  పాల్గొని భవన నిర్మాణం విజయవంతంగా పూర్తి కావాలని కాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూతన భవనం మున్నూరుకాపు సమాజ అభివృద్ధికి, సామాజిక సేవ కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవన నిర్మాణానికి ప్రతీ ఒక్కరు సహకరించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకం తిరుపతి, జిల్లా అధ్యక్షుడు గుర్రప్పగారి రాజులు, పట్టణ కార్యదర్శి నాయకం సత్యనారాయణ, బస్సా శ్రీనివాస్, బస్సా మన్మోహన్, ఆకుల కిష్టయ్య, ఆకుల మల్లేశం, చెంది సత్యనారాయణ, పెట్టుగారి శ్రీనివాస్, ధర్మారం రమేశ్, గడీల ఈశ్వరయ్య, కర్రు శ్రీనివాస్, కాటం సుధాకర్, మడిపల్లి బాపయ్య, చల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bhumi-pooja-for-construction-of-munnurukapu-building/article-18052

Tags: