బాధిత కుటుంబానికి  చేయూత

బాధిత కుటుంబానికి  చేయూత

విశ్వంభర, సిద్దిపేట: మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన చెప్యాల రీత-దీపక్ దంపతులకు ఆరు నెలల క్రితం ఓ బాబు జన్మించాడు. దురదృష్టవశాత్తు బాబుకు పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఏర్పడటంతో సిద్దిపేటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే నెలరోజులపాటు బాబుకు చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జి అయ్యారు. నెలరోజుల్లో దాదాపు రూ.14లక్షల ఖర్చు అయింది. చిన్నపాటి ప్రయివేట్ జాబ్ చేసుకుని జీవనం సాగించే దంపతులకు పెద్ద మొత్తంలో ఖర్చు కావడంతో ఆర్థికంగా చితికిపోయారు. అప్పులుజేసి బాబుకు చికిత్స అందించారు. దాంతోపాటు పాసివాడి గుండెకు రంధ్రం పేరుతో అప్పట్లో పలు పత్రికలు వార్తలను ప్రచురించాయి. పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న చేయూత ఫౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. తమ వంతు ఆర్థికసాయంగా రూ.10వేల రూపాయలను ఆదివారం అందించారు. కార్యక్రమంలో గ్రూపు సభ్యులు అనిల్, శ్రావణ్, అనిల్, బాబు, చంద్రశేఖర్, శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/aid-to-the-victims-family/article-18060

Tags: