కార్యకర్తలకు అండగా ఉంటా
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన బిజెపి యువ మోర్చా జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు తల్లి అక్కినపల్లి శాంతమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి సైదులు కుటుంబాన్ని పరామర్శించి శాంతమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కన్నె కంటి. వెంకటేశ్వర చారి, వార్డ్ మెంబర్లు సుర్వి హరిబాబు, యాదాసు లక్ష్మణ్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



