ఏదులాబాద్ చెరువులో యువకుడు గల్లంతు..
On
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో యువకుడు గల్లంతైన ఘటన కలకలం రేపింది. చెరువు పక్కన అనుమానాస్పదంగా పార్క్ చేసిన బైక్ ఆధారంగా సచిన్ దేశ్పాండేగా గుర్తించారు. సీసీటీవీ పరిశీలనలో మంగళవారం చెరువు వద్దకు వచ్చినట్టు తేలింది. ఆత్మహత్య అనుమానంతో ఎన్ఐఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది బుధవారం గాలింపు చేపట్టారు ఇప్పటివరకు ఏలాంటి ఆచూకీ లభ్యం కాలేదు.



