దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి
విశ్వంభర, హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం, కోదాడలో జరిగిన ఘటనపై సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్ లో డీజీపీ శివధర్‌రెడ్డిని కలిసి మెమోరాండం సమర్పించింది. కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కుమ్మెర గ్రామంలో జరిగిన దాడిలో రెండు నెలల పసిబిడ్డ మృతి చెందిన ఘటనలో మొత్తం తొమ్మిది మందిపై హత్య కేసు నమోదు చేసి అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటివరకు నలుగురినే అరెస్టు చేశారని, మిగిలిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పేర్కొంది. సంబంధిత పోలీస్ అధికారుల పాత్రపై విచారణ జరిపి అవసరమైతే సస్పెండ్ చేయాలని కోరింది. కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. డీజీపీ కేసులను దర్యాప్తు చేస్తున్నామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రతినిధి బృందంలో రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి. సాగర్, పార్టీ సీనియర్ నాయకులు



