క్రీడలతో ఆరోగ్యం : ఎంపీడీవో
On
విశ్వంభర, నెల్లికుదురు: క్రీడా పోటీలతో విద్యార్థుల్లో ఆరోగ్యం, ఉల్లాసం, దేహదారుడ్యం , ఐకమత్యం పెంపొందుతాయని ఎంపీడీవో సింగారపు కుమార్ అన్నారు. మేరా యువ భారత్ వరంగల్ కేంద్రం వారి ఆధ్వర్యంలో స్థానిక ఆదర్శ పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీవో కుమార్ తో పాటు స్థానిక సర్పంచి పులి వెంకన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ, అర్హత సాధించిన వారందరూ జరగబోయే క్రీడా పోటీలలో మరింత రాణించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. సంబంధిత పోటీలలోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ధరావత్ రాజేందర్, అధ్యాపకులు ఉపాధ్యాయులు వివిధ బ్లాక్ ల క్రీడాకారులు పాల్గొన్నారు.



