కాంగ్రెస్ నేతను పరామర్శించిన కేఎల్ ఆర్
On
విశ్వంభర, మహేశ్వరం : తుక్కుగూడ, పహాడీషరీఫ్ లో మాజీ సర్పంచ్ ఇంటికి కాంగ్రెస్ నేత , సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ అబ్దుల్లా బిన్ అవాద్ తండ్రి అవాద్ బిన్ అబ్దుల్లా అనారోగ్యంతో మంగళవారం మరణించారు, ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్ఆర్ పహాడీషరీఫ్ అబ్దుల్లా నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాప్రతినిధిగా, సమాజ సేవలో నిరంతరం ఉండే అబ్దుల్లాకు తండ్రి లేని లోటు తీర్చలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



