క్విజ్ పోటీలలో మిట్ట కోడూరు విద్యార్థుల ప్రతిభ 

క్విజ్ పోటీలలో మిట్ట కోడూరు విద్యార్థుల ప్రతిభ 

విశ్వంభర, పరిగి: శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్  గడిసింగాపూర్ కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీలలో  మిట్ట కోడూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మొదటి బహుమతి లభించింది.స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు  ఎన్. జాంప్లా , శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. రెండో బహుమతిగా  యు పి ఎస్ ,రంగంపల్లి విద్యార్థులు, మూడవ బహుమతి ప్రాథమిక పాఠశాల గడిసింగాపూర్ విద్యార్థుల కు లభించాయి. ఈ కార్యక్రమంలో  మండల విద్యాధికారి  గోపాల్,  పి ఆర్ టి యు పరిగి మండల శాఖ అధ్యక్షులు  బుగ్గయ్య . గౌరవ అధ్యక్షులు ఎండి  ఉస్మాన్ అలీ,  ప్రధాన కార్యదర్శి  రాకేష్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: