నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి
On
విశ్వంభర, రామన్నపేట: పట్టణ కేంద్రంలోని గరిక వేదశ్రీ గార్డెన్ లో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన పోనుగోటి లింగారావు కుమార్తె వివాహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు దోమల సతీష్, ఎండి అమీర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల రాంబాబు, ఉప సర్పంచ్ చొప్పరి నరసింహ, వార్డు మెంబర్లు బైరోజు పురుషోత్తం, నల్ల సైదులు, కన్నెబోయిన వెంకటేశం పాల్గొన్నారు.



