నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు
17 లీటర్ల నాటుసారా, 10 కిలోల పటిక స్వాధీనం.. 1,200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలంలోని శనిగగపురం తండా, బోడగుట్ట తండా, నడివాడ, గడ్డిగూడెం తండా, అనంతారం గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, డీటీఎఫ్-మహబూబాబాద్, వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంయుక్త బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. దాడుల్లో ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసి, 17 లీటర్ల నాటుసారా, 10 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం నిందితులను మహబూబాబాద్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేసులో అనంతారం గ్రామానికి చెందిన సంపతి లక్ష్మి, గడ్డిగూడెం తండాకు చెందిన ధరావత్ కౌసల్య, బోడగుట్ట తండాకు చెందిన గుగులోతు భద్రును నిందితులుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ జి. చిరంజీవి మాట్లాడుతూ.. మద్యానికి బానిసై ఆరోగ్యాన్ని, కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రతి వ్యక్తి ప్రశాంతమైన జీవితం గడపాలని, అక్రమ మద్యం తయారీ, విక్రయాలు లేదా రవాణాలో ఎవరైనా పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ అధికారులు సీహెచ్. నాగేశ్వరరావు, సీహెచ్. నీరజ, జి. చంద్రశేఖర్, ఎస్సైలు ఆర్. కిరీటి, జి. మౌనిక, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు సంపూర్ణ, గోపి, బలరాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.