ఓటర్లకు మరింత అవగాహన కల్పించాలి
విశ్వంభర, సికింద్రాబాదు : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు అయ్యేలా మరింత అవగాహన కల్పించాలని సికింద్రాబాదు ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాదు చిలకలగూడలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ సహాయ కేంద్రాన్ని, జోషి కాంపౌండ్‌లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అవసరమైతే మరిన్ని సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా బూత్ లెవల్ ఏజెంట్లు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో: బీఆర్ఎస్ యువ నాయకుడు తీగుళ్ల కిశోర్ కుమార్, సమన్వయకర్త రాజా సుందర్, జహంగీర్ భాయ్ పాల్గొన్నారు.