23 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్టు

విశ్వంభర, హైదరాబాదు : చార్మినార్ టాస్క్‌ఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులతో పాటు ఒక చట్టవిరుద్ధ చర్యలో ఉన్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన సరఫరాదారు, గంజాయి స్వీకరించే మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును చార్మినార్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సైదాబాబు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, అబిడ్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఛేదించారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/23-kg-of-ganja-seized-four-arrested/article-17964

Tags: