ప్రజాహిత సాహిత్యం శాశ్వతంగా నిలుస్తుంది
విశ్వంభర, చిక్కడపల్లి : ప్రజాహితాన్ని ప్రతిబింబించే సాహిత్యం సమాజంలో శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహితీ సప్తాహంలో భాగంగా ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన ‘నాగార్జున’ గ్రంథాన్ని బసవరాజు శ్రీనివాస్ ఆవిష్కరించి మాట్లాడుతూ, ఇనాక్ రచనలు దళిత దృక్పథంతో పాటు సమాజంలోని అసమానతలను ప్రతిబింబిస్తాయని, ఆయన ఎదుర్కొన్న వివక్షను హృదయాన్ని హత్తుకునేలా రచనల్లో ఆవిష్కరించారని అన్నారు. రాధా కుసుమ గ్రంథ సమీక్ష చేయగా, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముందు వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నాట్య గురువు రాజశ్రీ, సంగీత గురువు పద్మజ శిష్యబృందం కూచిపూడి నృత్య, సంగీత ప్రదర్శనతో ఆకట్టుకుంది.