పోలీస్ ల  ఆధ్వర్యంలో కోమటిపల్లి లో కళాజాత

విశ్వంభర, ఇనుగుర్తి: మూఢనమ్మకాలు, మహిళలపై అత్యాచారాలు,వేధింపులు, డయల్ 100 సేవలు వినియోగం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన, చైతన్యం కోసం జిల్లా ఎస్పీ డా.శబరిష్ ఆదేశాల మేరకు ఇనుగుర్తి ఎస్ఐ గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో మండలంలోని కోమటిపల్లిలో గురువారం రాత్రి కళాజాత నిర్వహించారు. కళాజాత ఇంచార్జ్ వడ్లకొండ సతీష్ బృందం ప్రదర్శించిన ఆట పాట ప్రదర్శన గ్రామస్తులను ఆకట్టుకొని ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా ఎస్సై కరుణాకర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ తరించాలన్నారు.వాడలలో, ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని భద్రతను పెంపొందించుకోవాలని చెప్పారు.సైబర్ నేరాలు, గంజాయి వినియోగం, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదాలు, మహిళలు,చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. అపరిచితులు,అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో పాటు,సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్,మాజీ సర్పంచి రావుల మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కూరెల్లి సతీష్,రామచందర్,కళాజాత బృంద ఇఛార్జ్  వడ్లకొండ సతీష్,సభ్యులు మాదాసి తిరుపతి, మచ్చ పృధ్విరాజ్, మంద ప్రవీణ్, పోలీస్ కానిస్టేబుల్స్ మహేష్,సునీల్ గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kalajata-in-komatipalli-under-the-control-of-police/article-17956

Tags: