ఇనుగుర్తి మండల ఎంఈఓ గా వెన్న వెంకట్ రెడ్డి

విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల ఫుల్ అడిషనల్ ఇంచార్జ్(ఎఫ్ఎసి)ఎంఈఓ గా చిన్న ముప్పారం జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు వెన్న వెంకటరెడ్డి ని నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇనుగుర్తి లోని విద్యా వనరుల కేంద్రంలో వెంకటరెడ్డి ఎంఈఓ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంచార్జ్ ఎంఈఓ గా మండలంలో పనిచేసిన జంగా రూపా రాణి రిటైర్డ్ కావడంతో ఆమె స్థానంలో వెంకటరెడ్డి నియామకమయ్యారు. మండల ఉపాధ్యాయ సంఘం బాధ్యులు నూతన ఎంఈఓ కు స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.కార్యక్రమంలో మాజీ ఇంచార్జ్ ఎంఈఓ జంగ రూపారాణి, ఇనుగుర్తి హై స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు అమ్మ యాకయ్య, పిఆర్టియు మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షులు మధుబాబు,టి పి టి ఎఫ్ అధ్యక్షులు ఉప్పలయ్య, టి పి యు ఎస్ బాధ్యులు రమేష్,పిఎస్ హెచ్ఎం వీరన్న, ఉపాధ్యాయులు ఎస్.వీరన్న, బాలరాజు,సిఆర్పిలు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/%E0%B0%87%E0%B0%A8%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%82%E0%B0%88%E0%B0%93-%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF/article-17981

Tags: