విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి సి ఎల్ డి పి కార్యక్రమాలు దోహదం
విశ్వంభర, హుస్నాబాద్ : విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాల పెంపే లక్ష్యంగా హుస్నాబాద్ పట్టణంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్‌లో శుక్రవారం కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల గేమ్స్, గ్రూప్ డిస్కషన్స్, ప్రసంగాలు, క్విజ్ పోటీలను నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ జోనల్ ఇంచార్జ్ బాలకిషన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సి ఎల్ డి పి ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం. మాధవీలత, సి ఎల్ డి పి ఇంచార్జ్ శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.